ETV Bharat / state

త్వరలో మార్కెట్లోకి నానో డీఏపీ..ఇఫ్కో నెల్లూరు జిల్లా మేనేజర్ - నానో యూరియా రైతు భరోసా కేంద్రాల్లో

NANO UREA: రైతులు ఎంతో కష్టపడి పంటను పండిస్తారు. వరి పంటకు తెగులు సర్వసాధారణం. రైతులు తెగులును నియంత్రణకు అధిక మొత్తంలో పెట్టుబడి పెడుతుంటారు. వారి పెట్టుబడులను తగ్గించాడానికి సులువుగా తెగలును నియంత్రించడానికి ఇఫ్కో సంస్థ నానో యూరియాను తీసుకువచ్చింది. దీనిని ఉపయోగించడం వలన వరి పంట ఆరోగ్యంగా ఉందని నెల్లూరు జిల్లా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అతి త్వరలో నానో డీఏపీ కూడా అందుబాటులోకి వస్తుందని ఇఫ్కో సంస్థ జిల్లా మేనేజర్ లక్ష్మీ నారాయణ అన్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 12, 2023, 5:54 PM IST

NANO UREA : సాధారణ యూరియా కంటే ఇఫ్కో సంస్థ విడుదల చేసిన నానో యూరియా చాలా బాగుందని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నానో యూరియా వరి పంటకు స్ప్రే చేయడం వలన తెగుళ్లు తగ్గుతున్నాయని మంచి దిగుబడిలో కూడా వస్తున్నాయని రైతులు వెల్లడించారు. నానో యూరియాను డ్రోన్ సహాయంతో స్ప్రే చేయటం వలన పని కూడా సులువుగా అవుతుందని, సమయం కూడా ఆదా అవుతోందని వారు తెలిపారు.

నానో యూరియాతో మంచి ఫలితాలు రావడంతో.. జిల్లాలో దీని వాడకం ఎక్కువైంది. రైతుల్లో ఎక్కువ మంది ఈ నానో యూరియానే వాడేందుకు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో ఈ రబి సీజన్లో వేలాది మంది రైతులు వరి పంటకు డ్రోన్ సహాయంతో నానో యూరియా స్ప్రే చేశారు. నానో యూరియా స్ప్రే చేయటం వలన పంట బాగా ఉందని రైతులు చెబుతున్నారు. నానో యూరియా వాడటం వలన అగ్గి తెగులు, పొడ తెగులు రాలేదని రైతులు చెబుతున్నారు. ఖర్చులు, పని కూడా తగ్గుతున్నాయని రైతులు అంటున్నారు.

సాధారణ యూరియా, నానో యూరియా కి చాలా మార్పులు ఉన్నాయని రైతు నాయకులు చెబుతున్నారు. సాధారణ యూరియా వేసిన వరి పంట కింద పడిపోతుందని, నానో యూరియా వాడిన వరి పంట నిట్టనిలువుగా పైకి లేచి ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఫంగస్ కూడా రావడం లేదని వారు అంటున్నారు. వరి నాటిన 30 రోజుల తర్వాత ఈ నానో యూరియా వరి పంటకు స్ప్రే చేస్తే మంచిదని వారు చెబుతున్నారు.

రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇఫ్కో సంస్థ నానో యూరియాను అందుబాటులోకి తెచ్చిందని ఇఫ్కో సంస్థ నెల్లూరు జిల్లా మేనేజర్ లక్ష్మీ నారాయణ తెలిపారు. నానో యూరియా రైతుల వరి పంటకు వాడటం వలన మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన చెబుతున్నారు.నానో యూరియా వరి పంటకు వాడటం వలన మంచి దిగుబడులే వస్తున్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నానో యూరియా రైతు భరోసా కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉంటుందన్నారు. త్వరలో నానో డీఏపీ కూడా అందుబాటులోకి తెస్తామని ఆయన చెబుతున్నారు. నానో డీఏపీ తక్కువ ధర ఉంటుదని, తెగులు రాకుండా శక్తివంతగా పనిచేస్తుందని అన్నారు. త్వరలో మే, జూన్ లోపు నాన్ డీఏపీ రైతులకు అందుబాటులో ఉంటుందని లక్ష్మీ నారాయణ అన్నారు.

" ఈ సంవత్సరం నానో యూరియా వాడాను. రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంది. చీడ పరుగులు చాలా వరకు తగ్గినాయి. రెండు సంవత్సారాల నుంచి తెగులు వస్తుండేది నానో యూరియా వాడిన నుంచి ఎటువంటి తెగుళ్లు రాలేదు. పైరు కూడా ఆరోగ్యంగా ఉంది. - " వెంకట్రావు, వరి రైతు

" నానో యూరియా నెల్లూరు జిల్లాలో డేమో చేశాము . చాలా మంచి ఫలితాలు వచ్చాయి. రైతులకు తక్కువ ధరలో ఉంటుంది. త్వరలో మే, జూన్ లోపు నాన్ డీఏపీ రైతులకు అందుబాటులో ఉంటుంది. - " లక్ష్మీ నారాయణ ,ఇఫ్కో సంస్థ నెల్లూరు జిల్లా మేనేజర్

అతి త్వరలో మార్కెట్లోకి నానో డీఏపీ..ఇఫ్కో సంస్థ నెల్లూరు జిల్లా మేనేజర్ వెల్లడి

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.