నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం గ్రామంలోని సచివాలయ మహిళా సిబ్బందిని వైకాపా నేత ఎర్రమల సుబ్బారెడ్డి వేధింపులకు గురి చేస్తున్నారని సచివాలయ సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు నందవరం సచివాలయ సిబ్బంది.. విధులు బహిష్కరించి మర్రిపాడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వైకాపా నేత వేధింపులు భరించలేక ఆందోళనకు దిగినట్లు సిబ్బంది పేర్కొన్నారు. ఈ క్రమంలో వాళ్ల బాధను ఎంపీడీవోకు విన్నవించుకున్నారు.
సచివాలయ సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్న సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సుబ్బారెడ్డిపై మర్రిపాడు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.
ఇదీ చదవండి..