నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం మండలం వడ్డి పాలెం గ్రామంలో చిన్నారి వైద్యానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేయూతనందించారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారి షణ్ముఖ అభిరామ్ వైద్యానికి.. 2 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించారు. బాలుడి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే బాలుడి బతల్లిదండ్రులను అడిగి.. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ట్రస్ట్ తరపున ఈ ఆర్ధిక సహాయం చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. గుండె సంబంధిత వైద్యులతో సంప్రదించి.. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆపరేషన్ చేయిస్తామని వారికి భరోసా ఇచ్చారు.
ఇవీ చూడండి…