రబీ సీజన్లో ఎనిమిది లక్షల పదివేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తాగునీటి సలహా మండలి సమావేశంలో మంత్రులు అనిల్ కుమార్, గౌతమ్‌రెడ్డి నిర్ణయించారు. సోమశిల జలాశయం కింద పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో ఐదు లక్షల ఎకరాలకు, కండలేరు జలాశయం కింద మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు సాగునీరు వదిలామని, రేపటినుంచి అన్ని ప్రాంతాలకు నీరు ఇస్తామని మంత్రి తెలిపారు. ఒక్క ఎకరం కూడా ఎండనివ్వకుండా ఈ రబీ సీజన్లో సాగునీరు అందిస్తామన్నారు.
ఇదీ చదవండి: వీర జవాను ప్రాణత్యాగం వెలకట్టలేనిది : సీఎం జగన్