నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ల్యాబ్‌లో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ అనే వ్యక్తి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్‌లో అమ్ముతుండగా విజిలెన్స్ పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. ఒక్కో ఇంజక్షన్‌ను రూ.30వేలకు బ్లాక్‌లో అమ్ముతున్నట్లు పోలీసులు చెప్పారు. ఒంగోలుకు చెందిన వలి అనే వ్యక్తితో కలిసి ఈ విక్రయాలు సాగిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులుతెలిపారు.
ఇదీ చదవండి: నాయుడుపేటలో తెదేపా అధినేత జన్మదిన వేడుకలు