Mekapati Vikram Reddy: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికకు వైకాపా నుంచి నామినేషన్ దాఖలైంది. వైకాపా అభ్యర్ధిగా మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆత్మకూరు అభయాంజనేయ స్వామి దేవస్థానంలో మేకపాటి విక్రమ్ రెడ్డి పూజలు చేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు పొల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ ర్యాలీలో ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వైకాపా రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్‌ను మేకపాటి విక్రమ్ రెడ్డి కలిశారు. ఆయనకు సీఎం జగన్ బీ ఫారం అందజేశారు.
Mekapati Goutham Reddy on Atmakur bypoll: ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆత్మకూరు ఉపఎన్నిక వైకాపా అభ్యర్థి విక్రమ్ రెడ్డి అన్నారు. దివంగత, మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని విక్రమ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఎన్నికలో మంచి మెజారిటీతో గెలుపొందుతామని విక్రమ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Schedule Release: నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంలో జూన్ 23న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వైకాపా తరఫున పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఐటీ, పరిశ్రమల మంత్రిగా పని చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక జరగనుంది. దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.
ఏకగ్రీవ అవకాశాలు తక్కువే!: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా మేకపాటి విక్రమ్‌రెడ్డి బరిలో దిగనున్నారు. ఆయన దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు. మృతుడి కుటుంబ సభ్యులే పోటీలో ఉన్నందున ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా... గతం నుంచి పాటిస్తున్న సంప్రదాయాన్నే ఈసారీ పాటించాలని భావిస్తోంది. అయితే తెదేపా పోటీ చేయకపోయినప్పటికీ.. వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు తక్కువే. భాజపా సహా మరికొన్ని పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపే అవకాశం ఉన్నందున ఎన్నిక జరిగేందుకే ఎక్కువగా ఆస్కారం ఉంది.
ఇవీ చదవండి: