ETV Bharat / state

తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి

నెల్లూరు జిల్లా ఉదయగిరి బస్టాండ్​కి నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో బాధితుడు మృతి చెందాడు.

author img

By

Published : Aug 26, 2019, 3:20 PM IST

ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి
ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి

రోడ్డుపై నడిచి వెళుతున్న వ్యక్తిని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మంగళగిరి కాలనీకి చెందిన రాజా అనే వ్యక్తి బస్టాండ్ కూడలిలోని దర్గా కాంప్లెక్స్​లో క్షౌరశాల దుకాణాన్ని నడుపుకుంటున్నాడు. దుకాణాన్ని తెరిచేందుకు కాలనీ నుంచి బస్టాండ్ కూడలికి నడుచుకుంటూ వెళ్తుండగా బస్సు ఢీ కొట్టింది. ఈ ధాటికి ఆయన పక్కనే ఉన్న రాళ్లపై పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతను మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్​ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చెస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:రెండు వాహనాలు ఢీ..ఇద్దరికి తీవ్రగాయాలు

Intro:Ap_gnt_01_26_gravel_akrama_thavavakalu_av_3067949
Reporter: p.suryarao

( ) గుంటూరు జిల్లా అనంతవరం గ్రావెల్ క్వారీలో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇక్కడ ఎవరికీ ఎలాంటి అనుమతి లేనప్పటికె పట్టపగలే ప్రొక్లిన్ సాయంతో ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్ తరలిస్తున్నారు. రాజధాని పరిసర ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో ఈ మట్టిని ఒక్క ట్రాక్టర్ 3వేల చొప్పున అమ్మకాలు జరుగుతున్నాయి. గతంలో రాత్రిపూట ఈ తవ్వకాలు జరగ్గా.. ప్రస్తుతం పట్టపగలే దోపిడీకి ఒడిగట్టారు. రాజధాని ప్రాంతంలోనే ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. Body:ఇప్పటికైనా ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాలను అధికారులు అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.Conclusion:End
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.