నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నగరంలో పాజిటివ్ గా వచ్చిన ఓ వైద్యుని పరిస్థితి విషమంగా ఉంది. అధికారులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 9 గంటల వరకే నిత్యవసర దుకాణాలు అందుబాటులో ఉండగా... తర్వాత అన్నింటినీ మూయించేస్తున్నారు. జిల్లాలోని వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ దేవస్థానం వద్ద దేవాదాయశాఖ శీతల యాగం నిర్వహించింది. కరోనా మహమ్మారిని ప్రజల నుంచి దూరం చేయాలని మూడు రోజులపాటు ఈ క్రతువును నిర్వహిస్తున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, కుర్తాళం పీఠం ఆస్థాన పండితులు ,వెంకటగిరి రాజ వంశస్థులు సాయికృష్ణ యాచేంద్ర, సర్వజ్ఞ యాచేంద్ర పాల్గొన్నారు.
జిల్లాలోని నాయుడుపేట ఆర్డీవోకు వైకాపా నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి రూ.1లక్ష విలువైన మెడికల్ కిట్లను అందించారు. స్థానిక వ్యాపారులు రూ.1లక్ష చెక్కు ఎమ్మెల్యేకు అందించారు. పలువురు వస్తు సామగ్రి ఇచ్చారు. ఉదయగిరి మండలం అప్పసముద్రం పంచాయతీలోని ఐదు వందల కుటుంబాలకు సొసైటీ అధ్యక్షుడు చేజర్ల సుబ్బారెడ్డి నాలుగు టన్నుల కూరగాయలను ఉచితంగా పంపిణీ చేశారు. ఉదయగిరి పట్టణంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతాప్ కుమార్ ఆర్టీసీ సిబ్బందితో కలసి కరోనా విధుల్లో ఉన్న పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో కూరగాయల ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: