నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మసీదు ప్రారంభోత్సవాన్ని గ్రామానికి చెందిన కొందరు అడ్డుకున్నారు. మసీదులో నమాజు చేయకుండా తాళాలు వేసి అడ్డుకున్నారని ముస్లింలు ఆరోపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. మసీదును వాడేందుకు వీలు లేదని.. పక్కనే దేవాలయం ఉందని స్థానికులంటున్నారని బాధితులు వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
ఏలేశ్వరంలో ఉత్కంఠ పోరు.. రీకౌంటింగ్ కోరుతూ తెదేపా నేతల ఆందోళన