రాపూరు మండలం పెంచలకోన ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం సాయంత్రం స్వామివారికి బంగారు హనుమంతు సేవ నిర్వహించారు. సేవలకు ముందు స్వామివారికి స్నపన తిరుమంజన పూజలు జరిపారు. ఏకాంత సేవలుగా జరిగే ఈ ఉత్సవాల్లో.. అర్చకుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
ఇవీ చూడండి...