నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం వద్ద బీసీ వసతి గృహం విద్యార్థులు ఆందోళనకు దిగారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనంలో ఉండలేమంటూ నిరసన తెలిపారు. గత 15 ఏళ్లుగా ఆత్మకూరు టెంకాయతోపు వద్ద ఉన్న అద్దె భవనంలోనే బీసీ హాస్టల్ నడుపుతున్నారు. ఆ భవనం శిధిలావస్థకు చేరింది. వర్షం వస్తే పెచ్చులూడుతున్నాయి. మరుగుదొడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. వర్షాకాలంలో ఏ గోడ పట్టుకున్నా విద్యుత్ వ్యాపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉండలేక కొంతమంది విద్యార్థులు వసతి గృహం ఖాళీ చేసి వెళ్తున్నారు.
విద్యార్థుల ఆందోళన
వసతి గృహ సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా బీసీ హస్టల్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. వసతి గృహం కంటే అక్కడే శుభ్రంగా వుందని రాత్రంతా అక్కడే నిద్రపోయారు.
ఇదీ చూడండి: