ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో అధ్వానంగా NH-16 - నెల్లూరు జాతీయ రహదారి

Kolkata To Chennai National Highway (NH-16) in Nellore District : రహదారిపై ప్రయాణం అంటే సాఫీగా సాగిపోతుంటుంది. కచ్చితమైన వేగంతో నిర్ధిష్ట సమయానికి గమ్యస్థానాలకు చేరుతామనే భావన ప్రయాణికులకు ఉంటుంది. ఇది సాధ్యపడాలంటే ఆ జాతీయ రహదారి నిర్వహణ సక్రమంగా ఉండాలి. కానీ నెల్లూరు నుంచి వెళ్లే 16 వ నెంబర్‌ జాతీయ రహదారి అడుగుకొక గుంతలా తయారైంది. ఈ రహదారిపై ప్రయాణమంటేనే ప్రజలు భయపడుతున్నారు. నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

kolkata_to_chennai_national_highway_nh-16_in_nellore_district

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 11:49 AM IST

Updated : Dec 12, 2023, 2:05 PM IST

నెల్లూరు జిల్లాలో అధ్వానంగా NH-16

Kolkata To Chennai National Highway (NH-16) in Nellore District : నెల్లూరులోని జాతీయ రహదారిని చూస్తే నాలుగేళ్లుగా నిత్యం చూస్తున్న రాష్ట్రంలోని ఏదో ఒక రోడ్డు అనుకునేలా తయారైంది. కానీ అది కలకత్తా నుంచి చెన్నై వెళ్లే 16 వ నంబర్‌ జాతీయ రహదారి (NH-16). ఆ రహదారిపై సాఫీగా సాగాల్సిన ప్రయాణం నెల్లూరు నుంచి సూళ్లూరుపేట మధ్య మరీ అధ్వానంగా తయారైంది. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఆరు వరుసల మార్గం.. ఆ ఊరికి శాపం

National Highway (NH-16) Damaged In Nellore : ఇటీవల వచ్చిన మిగ్‌జాం తుపాను ధాటికి రోడ్డుపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. ఈనాడు-ఈటీవీ పరిశీలనలో సుమారు 15 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి దెబ్బతింది. జాతీయ రహదారుల నిర్వహణ కోసం టోల్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ అధికారులు మరమ్మతులు చేపట్టడంలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సత్వరమే ఎన్​హెచ్​ఐ (National Highways Authority of India) అధికారులు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మృత్యుమార్గంగా ఆ 28 కి.మీ లు.. రెండేళ్లలో 109 మంది మృతి

Road Problems In Nellore District : నెల్లూరు నుంచి జాతీయ రహదారిపై వెళ్లే మార్గంలో వెంకటేశ్వరపురం, ఎన్టీఆర్ నగర్, అల్లీపురానికి వెళ్లే రహదారి, పల్లెపాడు రోడ్డు, మెడికవర్ ఆసుపత్రి, పెన్నా వంతెన సమీప ప్రాంతాల్లో జాతీయ రహదారి దుస్థితి దయనీయంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. తాత్కాలికంగా చేసిన ప్యాచ్ వర్కులు దెబ్బతినడంతో కంకర పైకి తేలి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని చెబుతున్నారు.

భారీ వరదల కారణంగా కోవూరు వద్ద కోతకు గురైన హైవే..!

People Afraid to Travel on NH- 16 Road : 16 వ నంబరు జాతీయ రహదారిపై గుంతలు చూసిన స్థానికులు రాష్ట్రంలోని రోడ్లకు పోటీ వచ్చేలా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్ర రహదారులకు పట్టిన గతే జాతీయ రహదారులకు పట్టడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రమాదాలకు నెలవుగా మారుతున్న ప్రాణాంతక గుంతల రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు.

National Highway- 16 (NH-16) : గుంతలమయమైన నెల్లూరు జాతీయ రహదారిపై (Natinal Highway) అధికారులు ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు అధికమవుతున్నాయని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్​హెచ్​ఐ అధికారులు స్పందించి త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

వీడేవడండి బాబూ - రాత్రికి రాత్రే రోడ్డు తవ్వేసి కంకర, మట్టి మాయం

Last Updated : Dec 12, 2023, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.