తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ వైకాపా నేత కర్లగుంట మధుబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు నివాసంలో జరిగిన కార్యక్రమంలో లోకేశ్.. మధుబాబుకి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్, మాలేపాటి సుబ్బానాయుడు, మల్లిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి..