ETV Bharat / state

నెల్లూరులో ఇండియన్​ రెడ్​ క్రాస్​ శతాబ్ది ఉత్సవాలు - nellore district collector latest news

నెల్లూరులో ఇండియన్​ రెడ్​ క్రాస్​ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతి ఒక్కరూ చిన్నతనం నుంచే సేవాభావం అలవర్చుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్​ పిలుపునిచ్చారు.

Indian Red Cross Centenary Celebrations
ఇండియన్​ రెడ్​ క్రాస్​ శతాబ్ది ఉత్సవాలు
author img

By

Published : Mar 21, 2021, 11:16 AM IST

నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ వద్ద ఇండియన్ రెడ్ క్రాస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చక్రధర బాబు​, ఎస్పీ భాస్కర్ భూషణ్ కలిసి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్​ పరిశీలించారు. వారిద్దరూ సైకిల్​ యాత్రను ప్రారంభించి.. సైకిల్​ తొక్కుతూ.. రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ చిన్నతనం నుంచే సేవాభావం అలవర్చుకోవాలని కలెక్టర్​ పిలుపునిచ్చారు. సేవా దృక్పథంతో ప్రారంభమైన ఈ సంస్థ వందేళ్లుగా సేవలు అందిస్తుండటం అభినందనీయమన్నారు.

స్వచ్ఛభారత్​లో భాగంగా నెల్లూరును శుభ్రత, ఆరోగ్యపరంగా దేశంలోనే ముందుంచేందుకు విద్యార్థులు తమవంతు కృషి చేయాలని కలెక్టర్​ కోరారు. జిల్లాలోని రెడ్ క్రాస్​కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని ఆ సంస్థ రాష్ట్ర చైర్మన్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. కరోనా, ఎన్నికల సమయాల్లో మెరుగైన సేవలందించినట్లు చెప్పారు. రక్త సేకరణలోనూ, యూత్ మెంబర్ల నియామకంలోనూ నెల్లూరు రెడ్ క్రాస్ ముందజలో ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర, జిల్లా చైర్మన్లు శ్రీధర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: తిరుపతిలో గెలిపించండి.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతా: పనబాక లక్ష్మీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.