నెల్లూరు జిల్లా గూడూరులో చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. 250 మంది కార్మికులకు కమిషనర్ ఓబులేసు చేతుల మీదుగా దుస్తులు అందజేశారు. అనంతరం వారి కాళ్ళు కడిగి పూలతో సన్మానించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ కష్టకాలంలో ప్రాణాలను లెక్కచేయకుండా నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివన్నారు. వారిని సన్మానించాలనే ఫౌండేషన్ ఆలోచన అభినందనీయమన్నారు.
ఇవీ చదవండి... కరోనా బీమా కోరుతూ ఆర్టీసీ కార్మికుల నిరసన