నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అరగంట పాటు వర్షం కుండపోతగా కురిసింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లోని వీధులు జలమయమయ్యాయి. నగరంలోని ఎన్టీఆర్ కాలనీ, బొప్పాపురం, బీసీ కాలనీ, బొమ్మిడి కాలువ, తదితర ప్రదేశాల్లోని రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. భారీగా కురిసిన వర్షానికి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి నిమ్మతోటలకు నీటి సమస్య తొలిగినట్లు అయిందని సాగుదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరులో భారీ వర్షం.. నిమ్మ రైతుల హర్షం
నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడగా.. నిమ్మ సాగు రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
![నెల్లూరులో భారీ వర్షం.. నిమ్మ రైతుల హర్షం heavy-rain-in-sri-potti-sriramulu-nellore-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8064982-335-8064982-1595002788856.jpg?imwidth=3840)
నగరంలో భారీ వర్షం

ఇవీ చూడండి...