వైఎస్సార్ నేతన్న నేస్తంలో పేర్ల తొలగింపుని నిరసిస్తూ నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరులో చేనేత సంఘం నాయకులు నిరసన చేశారు. గతేడాది చెన్నూరు గ్రామంలో 280 మందికి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకంలో లబ్ధి పొందారు. కానీ ఈ ఏడాది 150 మందిని మాత్రమే ఎంపిక చేసి మిగతా వారి పేర్లు తొలగించారని చేనేత సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాసులు అన్నారు. లబ్ధిదారులందరికీ ఆర్థిక సాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: సీఎంకు విధేయుడినే.. అందుకే తప్పించేందుకు స్కెచ్ వేశారు'