నెల్లూరు జిల్లాలోని గూడూరు-ఏర్పేడు రాష్ట్ర రహదారి అస్తవ్యస్తంగా మారింది. 20 కిలోమీటర్లు కంకర తేలి పెద్ద గోతులతో దర్శనమిస్తోంది. ఏళ్లుగా కనీస మరమ్మతులకు నోచుకోకపోవటంతో... ఈ రహదారి ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. గోతుల్లో వాహనాలు పడిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనివల్ల ఎన్నో ప్రాణాలు బలవుతున్నాయి. ఇక రాత్రి వేళ ఈ రహదారిపై ప్రయాణించాలంటేనే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. వర్షాకాలంలో అయితే వారి కష్టాలు వర్ణనాతీతం. ఆ రోడ్డు పరిస్థితిపై మా ప్రతినిధి రాజారావు పూర్తి వివరాలు అందిస్తారు.
ఇదీ చదవండి