నెల్లూరులోని జీజీహెచ్ లోని ప్రసూతి, చిన్నపిల్లల ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న ఒప్పంద నర్సులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ఆసుపత్రిలో 217 మంది ఒప్పంద నర్సులు పనిచేస్తున్నారు. 2017లో వీరి నియామకం జరిగింది. ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం నెలకు ఇస్తున్న రూ. 24వేల వేతనాన్ని రూ. 34వేలకు పెంచాలని కోరారు. ప్రతి నెల జీతం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలోనూ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ భయపడకుండా సేవలు అందిస్తున్నామని చెప్పారు. తమను ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: