నెల్లూరులో కరోనా పరిస్థితులపై సీఎం జగన్కు రాసిన లేఖకు.. ఆరోగ్యశాఖ మంత్రి స్పందించినందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక్క నెల్లూరులోనే 40 శాతానికి పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడం వైరస్ వ్యాప్తి తీవ్రతకు అద్దంపడుతోందన్నారు. వెంటనే నెల్లూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సోమిరెడ్డి కోరారు. ప్రమాదకర పరిస్థితుల నుంచి జిల్లాను కాపాడాలని విన్నవించారు. 13 జిల్లాల కంటే ఎక్కువగా నెల్లూరులోనే కరోనా కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
ఇదీ చదవండీ.. శ్రమ‘ఫలం’పై... చేదు వైరస్!