నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో వరదనీరు వచ్చి చేరుతోంది. వారం రోజుల నుంచి కడప, కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు భారీ ఎత్తున సోమశిల జలాశయానికి నీరు వస్తోంది. వారం రోజుల క్రితం 43 టీఎంసీల నీరు ఉండగా.. ప్రస్తుతం 52 టీఎంసీల నీటి మట్టానికి చేరుకుంది. ఈ సీజన్లో వరి పంట రైతులకు ఎటువంటి నీటి కొరత ఉండదని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకా ఇలానే వర్షాలు కొనసాగితే జలాశయం పూర్తిగా నిండే అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండీ.. జీన్స్ వేసుకుందని బాలికను చంపేసిన కుటుంబీకులు