నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని లాలాపేట సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించారు. రైతులు తమ సమస్యలపై ఫోన్లు చేస్తే వెంటనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు సిబ్బంది కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని దళారుల మాట నమ్మి మోసపోవద్దని రైతులను కోరారు. అధైర్యపడవద్దని సూచించారు. ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఇవీ చదవండి: ఉపరాష్ట్రపతి చొరవతో.. పొరుగు జిల్లాలకు నెల్లూరు రబీ ధాన్యం