నిత్యం పని ఒత్తిడితో ఉండే విద్యుత్ శాఖ ఉద్యోగులకు మానసిక, శారీరక ఉల్లాసాన్ని ఇచ్చేందుకు నెల్లూరు కేంద్రంగా రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. 13 జిల్లాల ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, డిస్క్‌మ్‌లకు చెందిన 200 మంది ఉద్యోగులుఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మూడ్రోజుల పాటు సాగే ఈ పోటీల్లో చెస్, క్యారమ్స్, టెన్నీస్ క్రీడలు నిర్వహిస్తున్నారు. నిరంతరం ఉద్యోగాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్న తమకు ఇలాంటి క్రీడలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఉద్యోగులు అంటున్నారు.
ఇదీ చదవండి: రాపాకకు ప్రవేశం లేదంటూ బ్యానర్.. జనసైనికుల వినూత్న నిరసన