Kavali Suicide Attempt : నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే నివాసం ఎదుట ఆత్మహత్యకు యత్నించిన తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు హర్ష ఆరోగ్యం పరిస్థితి విషమంగానే ఉంది. నెల్లూరు అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హర్షను.. మెరుగైన వైద్యం కోసం వైద్యులు చెన్నై అపోలో హాస్పటల్‌కు తరలించారు. నెల్లూరులోని ఆసుపత్రి వద్ద హర్ష కుటుంబ సభ్యులను టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి నాయకులు పరామర్శించారు.
కావలి ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే పోలీసులు వేధింపులకు గురిచేశారని.. అందుకే హర్ష ఆత్మహత్యకు ప్రయత్నించాడని ఆయన విమర్శించారు. కొంత మంది పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని.. వారి అక్రమాలను ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని అన్నారు.
ఇవీ చదవండి: