నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం కూడలి వద్ద మరమ్మతులకు గురై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులో దొంగతనం జరిగింది. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లే ఆర్టీసీ బస్సులో అర్ధరాత్రి దుండగులు డీజిల్ చోరీకి పాల్పడ్డారు. ప్రతి రోజూ లాగే బస్సును డ్రైవర్ నందవరం కూడలి వద్ద ఉన్న పెట్రోల్ బంకు వద్ద వదిలి వెళ్లాడు. తిరిగి ఉదయాన్నే తీసుకొని జంగాలపల్లి వెళ్లి విద్యార్థులను ఎక్కించుకుని వస్తుండగా నందవరానికి సమీపంలో బస్సు నిలిచిపోయింది. బస్సు డ్రైవర్ డీజిల్ ట్యాంకును గమనించగా తాళం పగులగొట్టి ఉండడం వల్ల డీజిల్ చోరీ అయినట్లు గుర్తించాడు. జరిగిన విషయాన్ని డిపో మేనేజర్‌కు తెలియజేశాడు. బస్సు నుంచి 150 లీటర్ల డీజిల్ దొంగతనం చేసినట్లు గుర్తించారు. దీనిపై మర్రిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు.
ఇదీ చదవండి: