డిగ్రీలో చేరనున్న విద్యార్థులు ఈనెల 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని వీఎస్‌యూ రిజిస్ట్రార్ విజయకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని విశ్వవిద్యాలయం అతిథిగృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 76 డిగ్రీ కళాశాలలు ఉన్నాయని.. వీటిలో మొదటి విడతగా పలు సీట్లు భర్తీ అయ్యాయని.. రెండో విడత అడ్మిషన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీని కోసం నగరంలోని డీకే మహిళా కళాశాల, నాయుడుపేట, ఉదయగిరి, వెంకటగిరి ప్రభుత్వ కళాశాలల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు 15వ తేదీలోపు ఆయా కళాశాలల్లో చేరాలని కోరారు. కార్యక్రమంలో పీజీసెట్ కన్వీనర్ వీరారెడ్డి, డీకే ప్రిన్సిపల్ మస్తానయ్య, మణికంఠ పాల్గొన్నారు.
అయిదో విడత ఐటీఐ ప్రవేశాలు
నెల్లూరు ఐటీఐ కళాశాలల్లో మిగిలిన సీట్లకు అయిదో విడతగా ఆన్‌లైన్ అడ్మిషన్లు ఈనెల 11వరకు అవకాశం ఉందని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు ప్రభుత్వ ఐటీఐలో 13న, ప్రైవేటు ఐటీఐలో 15న కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు.