నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎన్నికలకు సంబంధించి ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలపాలవ్వటంతో.. ఆసుపత్రికి తరలించారు. దీంతో వైకాపా నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఇదీ చదవండి: వరంగల్ ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ముగ్గురు మృతి