పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడు, నాంచారమ్మపేట, పెంటపాడులో ఇటీవలే సిమెంట్ రోడ్లు నిర్మించారు. రహదారులను నాసిరకంగా నిర్మించారని... బిల్లులు ఆపివేయాలని కోరుతూ చిల్లకూరు మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ శ్రీనివాసకుమారికి స్పందన అసోసియేషన్ సభ్యురాలు బిందుమహేశ్వరి వినతి పత్రం అందజేశారు. కోట్ల రూపాయల కాంట్రాక్టు తీసుకుని నాసిరకం కంకర, సిమెంటు వాడారని... రోడ్లు వేసి నెలరోజులు కాకముందే రోడ్లు అధ్వానంగా తయారవుతున్నాయని ఆరోపించారు.
ఇది కూడా చదవండి.