నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. నగరంలోని రాజన్న భవన్లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రక్తదానం చేశారు.
కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కన్నా, జగన్మోహన్ రెడ్డి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారని ఈ సందర్భంగా వారు కొనియాడారు.
ఇదీ చదవండి