నెల్లూరు జిల్లా వాకాడు మండలం జమీన్ కొత్తపాలెంలో భాజపా, వైకాపా కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గ్రామంలోని ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించారని వాకాడు తహశీల్దార్‌కు రెండ్రోజుల కిందట భాజపా ఫిర్యాదు చేసింది. ఈ అంశమే ఇరు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైందని స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం వాకాడు , గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి