ETV Bharat / state

'నివర్' నష్టంపై కేంద్ర బృందం ఆరా

author img

By

Published : Dec 17, 2020, 8:23 PM IST

నెల్లూరు జిల్లాలో నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. నష్టం వివరాలు తెలుసుకున్న కేంద్ర బృందం సభ్యులు.. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

'నివర్' నష్టంపై కేంద్ర బృందం ఆరా
'నివర్' నష్టంపై కేంద్ర బృందం ఆరా

నివర్ తుపాను కారణంగా నెల్లూరు జిల్లాలో నష్టపోయిన పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. అనంతరం నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పంట నష్టం రూ.20 కోట్లు, ఉద్యాన పంట నష్టం రూ.6 కోట్లు, పశువుల నష్టం రూ.2 కోట్ల మేర ఉంటుందని అధికారులు వెల్లడించారు.

తెలుగు గంగ ప్రాజెక్టుకు రూ.560 కోట్లు, మైనర్ ఇరిగేషన్ కింద రూ.385 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు కేంద్ర బృందానికి తెలియజేశారు. నష్టం వివరాలు తెలుసుకున్న కేంద్ర బృందం సభ్యులు.. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఇదీచదవండి

పెన్నా నదిలో ఏడుగురు యువకులు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.