ETV Bharat / state

సెల్​ఫోన్​ లారీ చోరీ కేసులో మరో నిందితుడు అరెస్ట్​

నెల్లూరు జిల్లాలోని దగదర్తి జాతీయ రహదారిపై 2018 డిసెంబర్​లో జరిగిన సెల్​ఫోన్​ లోడ్​తో వెళ్తున్న లారీ చోరీ కేసులో పోలీసులు తాజాగా మరో నిందితుణ్ని అరెస్టు చేశారు. గతంలో ఆరుగురిని కటకటాల్లోకి నెట్టిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

cell phone load lorry robbery case
చరవాణీ లోడ్​ లారీ కేసులో వ్యక్తి అరెస్ట్​
author img

By

Published : Mar 13, 2020, 9:36 PM IST

సెల్​ఫోన్​ లారీ చోరీ కేసులో మరో నిందితుడు అరెస్ట్​

నెల్లూరు జిల్లా దగదర్తి జాతీయ రహదారిపై 2018 డిసెంబర్​లో చోరీకి గురైన సెల్​ఫోన్​ లోడ్​ లారీ కేసులో పోలీసులు మరో నిందితుణ్ని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.25 లక్షలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఇదే కేసులో గతేడాది ఆగస్టులో ఆరుగురిని అరెస్ట్​ చేసిన పోలీసులు.. రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీ సిటీ నుంచి కలకత్తా వెళ్తున్న చరవాణి లోడ్​తో ఉన్న లారీని 2018 డిసెంబర్​లో మహారాష్ట్రకు చెందిన కంజర్​ భట్స్​ ముఠా చోరీ చేసింది. దొంగిలించిన సెలఫోన్ల విలువ 4 కోట్ల 80 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్​ చేసి మొత్తం డబ్బులను రికవరీ చేస్తామని జిల్లా ఎస్పీ భాస్కరన్​ భూషణ్​ తెలిపారు.

ఇదీ చదవండి:

ద్విచక్ర వాహన షోరూంలో దొంగతనం..రూ.2 లక్షలు చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.