ఇసుక రవాణాను ప్రభుత్వం వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇసుక రవాణాను నిలిపివేసిన కారణంగా.. పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త పాలసీని త్వరగా తీసుకువచ్చి ఇసుక రవాణాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి: