పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని భారతీయ జనతా పార్టీ సమర్ధించింది. కృష్ణా మిగులు జలాలపై ఏపీకి పూర్తి హక్కులు ఉన్నాయని ఆ పార్టీ నేతలు నెల్లూరులో అన్నారు. మా నీళ్ళు, మా ఇష్టమంటూ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడటం అభినందనీయమని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి కొనియాడారు.
జూరాల, కాళేశ్వరం నుంచి ఇష్ట ప్రకారం నీటిని తెలంగాణ తరలిస్తున్నా... ఆంధ్ర ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ ఫిర్యాదులు చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ తీసుకునే నిర్ణయాలకు ప్రజలందరూ మద్దతు ఇస్తారని చెప్పారు. ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీతో.. అన్ని వర్గాల వారికీ మేలు జరుగుతుందన్నారు.
ఇవీ చదవండి: