నెల్లూరులో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని తేదేపా కార్యాలయంలో నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న పార్టీ శ్రేణులు బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పాల్గొన్నారు. ప్రేమ, అభిమానానికి నిలువెత్తు రూపం బాలకృష్ణ అని బీదా కొనియాడారు.
ఇదీ చదవండి:రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారినెలా తొలగిస్తారు?: సుప్రీం