ETV Bharat / state

ఆక్వా జోన్ల పేరుతో దోపిడీ.. లబోదిబోమంటున్న రొయ్యలు, చేపల రైతులు - నెల్లూరు తీర ప్రాంతాలైన కావలిలో ఆక్వా రైతులకష్టాలు

AQUA FARMERS CURENT BILL PROBLEMS : పెరిగిన పెట్టుబడులతో అల్లాడుతున్న చేపల, రొయ్యల రైతులకు ప్రభుత్వం ఆక్వా జోన్​లు ఏర్పాటు చేసి భారీగా కరెంటు బిల్లులు పెంచడంతో ఏం చేయాలో అర్థంకాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నెల్లూరు జిల్లా ఆక్వా రైతులు..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 6, 2023, 4:11 PM IST

ఇప్పటికే సీడ్, ఫీడ్ ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆక్వా రైతులు

AQUA FARMERS CURENT BILL PROBLEMS : నెల్లూరు జిల్లాలో రొయ్యల, చేపల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెరిగిన పెట్టుబడులతో అల్లాడుతున్న చేపల, రొయ్యల రైతులకు.. ప్రభుత్వం ఆక్వా జోన్​లు ఏర్పాటు చేసి భారీగా కరెంటు బిల్లులు పెంచడంతో ఏం చేయాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వా జోన్​లు ఎత్తివేయాలంటూ రైతులు చెబుతున్నారు.

జిల్లాలోని తీర ప్రాంతాలైన కావలి, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు తదితర మండలాలలో ఎక్కువగా రైతులు చేపలు రొయ్యలు సాగు చేస్తుంటారు. సీడ్, ఫీడ్ ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆక్వా, చేపల రైతులపై ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఆక్వా జోన్లు ఏర్పాటు చేసి ప్రతి రైతు ఆక్వా జోన్ల పరిధిలోకి రావాలని చెప్పటంతో రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటివరకు యూనిట్​కి రూపాయి 50 పైసలు కరెంట్ బిల్లు కడుతున్న రైతులు, జోన్లు ఏర్పాటు చేయడంతో యూనిట్​కి 6 రూపాయల 50 పైసలు కరెంట్ బిల్లు చెల్లించాల్సి వస్తుందని ఆక్వా చేపల రైతులు మండి పడుతున్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు అన్ని విధాలా ఆదుకుంటామని చెబుతున్న ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతుందని రైతు నాయకుల మండిపడుతున్నారు. భారతదేశంలో మన రాష్ట్రానికి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చే ఆక్వా ఉత్పత్తులపై ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడం లేదని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆక్వా జోన్లు తీసివేసి, రైతులకు యూనిట్​కి రూపాయి 50 పైసలకు కరెంటు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రతి ఆక్వా, చేపల రైతులు తప్పనిసరిగా ఆక్వా జోన్లో పరిధిలోకి రావాలని మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు నాగేశ్వరరావు చెబుతున్నారు. తప్పనిసరిగా తన పొలం రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఆక్వా జోన్లో పరిధిలోకి రావటం జరుగుతుందన్నారు. పది ఎకరాల లోపు ఉన్న రైతులకు యూనిట్​కి రూపాయి 50 పైసలు చెల్లించాల్సి వస్తుందని, పది ఎకరాలు పైన ఉన్న రైతులు యూనిట్​కి 6 రూపాయల 80 పైసలు కట్టవలసిన అవసరం లేదని వారికి కూడా ప్రభుత్వం రాయితీ ఇస్తుందని వారు యూనిట్​కి 3 రూపాయల 80 పైసలు చెల్లించాలన్నారు.

ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత కరెంటు బిల్లులు తగ్గించింది. మేము రైతులందరం సంతోషపడ్డాం. చాలా ప్రోత్సాహకరంగా, మేలు జరుగుతందని, కానీ గత ఆరు నెలలుగా ఆక్వా జోన్స్​గా డిసైడ్ చేశారు. కొన్ని ఆక్వా జోన్స్ అని, మరికొన్ని నాన్ ఆక్వా జోన్స్ అని చేసి నాన్ ఆక్వా జోన్స్​లో బిల్లులు పెంచడం జరిగింది. - బాబు నాయుడు, చేపల సంఘం జిల్లా అధ్యక్షులు నెల్లూరు జిల్లా

పెట్టుబడులు ఎక్కువవుతున్నాయి. ప్రతి నెల కరెంటు బిల్లులులో తేడా వస్తుంది. ఇప్పుడు ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అని పెట్టారు. ఈ నెల యూనిట్​ మీద ఐదు రూపాయల 50 పైసలు ఎక్కువగా కరెంటు వస్తుంది. చేపలు చనిపోవడం జరుగుతుంది. రెట్స్ హెచ్చుతగ్గులుగా ఉంది. - నరేంద్ర, ఆక్వా రైతు

ఆక్వా జోన్ ఏర్పాటు వల్ల మాకు ఏమీ లాభం లేదు. యూనిట్​కి 5 నుంచి 6 రూపాయల వరకు చార్జ్ చేస్తా ఉన్నారు. ఆక్వా కల్చర్ మరీ అధ్వానంగా ఉంది. - మోహనయ్య, ఆక్వా రైతు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.