నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచలకోన ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులు పెనుశిల లక్ష్మి నరసింహస్వామి వార్ల కల్యాణోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణం కనువిందుగా సాగింది. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి.. ఈ ఉత్సవాన్ని తిలకించి మొక్కులు తీర్చుకున్నారు. గురువారం చక్రస్నానం నిర్వహిస్తారు. శనివారం ఉత్సవమూర్తులను గొనుపల్లికి సాగనంపడంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
నృసింహ జయంతి మరుసటి రోజు సాంప్రదాయంగా జరిగే ఈ ఉత్సవాల్లో ఏటా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా వచ్చేవారు. కొవిడ్ నిబంధనల మేరకు వేడుకలను ఈ ఏడాది ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
వైరల్ వీడియో: కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి మత ప్రార్ధనలు.. లక్ష జరిమానా