రాష్ట్ర రేషన్ బియ్యాన్ని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్న అంతర్జాతీయ ముఠాను నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి 2 లారీలు, అక్రమ బిల్లులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాతో సంబంధం ఉన్న మరి కొంతమంది కోసం గాలిస్తున్నారు. గత నెల 29న కృష్ణపట్నం పోర్ట్ లో 5.5 కోట్ల రూపాయల విలువైన 1645 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడింది. కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు.
ఎ - గ్రేడ్ బియ్యంగా మార్చి...
అంతర్జాతీయ ఎక్స్పోర్ట్ కంపెనీ అయిన మోయ్ కమోడిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. విజయవాడకు చెందిన ఎస్.ఎం.ఆర్. ట్రేడర్స్ తోపాటు పలువురు రైస్ మిల్లర్లు ఇందులో భాగస్వామ్యం అయినట్లు చెప్పారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి రేషన్ బియ్యం సేకరించి వాటిని ఎ - గ్రేడ్ బియ్యంగా మార్చి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: