నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం, గండవరం గ్రామంలోని ఓ మహిళా రైతు ఆత‌్మహత్యాయత్నం చేసింది. తన భూమిని ఇళ్ల స్థలాల కోసం తీసుకుంటున్నారని రమణమ్మ అనే మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది.
ఈమె 50 ఏళ్లుగా గ్రామంలో కొంత భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే... ఇటీవల అధికారులు ఆ భూమిని ఇళ్ల స్థలాల కోసం తీసుకుంటున్నట్లు చెప్పటంతో, తీవ్ర ఆవేదనకు లోనైన ఆమె... ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించటంతో వారు ఆమెను అదుపులోకి తీసుకుని, స్టేషన్కు తరలించారు. తన జీవనాధారాన్ని దూరం చేయొద్దంటూ ఆమె అధికారులను వేడుకుంటోంది.
ఇవీ చూడండి