ETV Bharat / state

కర్ణాటకలో హత్య.. రాపూరు అడవుల్లో మృతదేహం - కర్ణాటకలో హత్య.. రాపూరు అడవుల్లో మృతదేహం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంధువు ఒకరిని హత్యచేసి నెల్లూరు జిల్లా రాపూరు అటవీ ప్రాంతంతో పూడ్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆర్థిక లావాదేవీలే ఇందుకు కారణమని అక్కడి పోలీసులు కనుగొన్నారు. రేపు నిందితుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేపట్టారు.

muder case chased by karnataka police dead body was burried in rupuru forests in nellore district
కర్ణాటకలో హత్య.. రాపూరు అడవుల్లో మృతదేహం
author img

By

Published : Feb 1, 2021, 1:49 PM IST

కర్ణాటకలో హత్య చేసి మృతదేహాన్ని నెల్లూరు జిల్లా రాపూరు అడవుల్లో పూడ్చిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. బెంగుళూరుకు చెందిన సిద్ధార్థ అనే వ్యక్తిని హత్య చేసి రాపూరు మండలం గుండవోలు అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు బెంగుళూరుకు చెందిన అమృత హళ్లి పోలీస్ స్టేషన్ నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని బెంగళూరు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు సమాచారం. మృతుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంధువని తెలుస్తోంది.

సిద్ధార్థ మృతదేహాన్ని వెలికితీసేందుకు చర్యలు ప్రారంభించారు. స్థానిక పోలీసులు సహకారంతో రేపు వెలికి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హంతకులను నిన్న అరెస్టు చేసి రిమాండ్​కు పంపిన పోలీసులు.. ఇవాళ కస్టడీకి తీసుకుని, రేపు గుండవోలుకు వస్తారని రాపూరు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

భార్యను చంపిన భర్త.. అనుమానమే కారణమా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.