నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం మండల కేంద్రం పరిధిలోని కోటవీధికి చెందిన ఓ యువకుడు... ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోటవీధికి చెందిన ఖాన్ సావళి కుమారుడు షేక్ సంధాని ఇంట్లో చీరతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఐదు నెలల క్రితం అతని తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడని ఎస్సై రవీంద్ర నాయక్ తెలిపారు. తండ్రి అనారోగ్యంగా ఉన్న సమయంలో వైద్యం చేయించేందుకు సంధాని రూ.3 లక్షల వరకు అప్పు చేశాడని చెప్పారు.
రూ.3 లక్షల అప్పు వల్లే..
అప్పు ఇచ్చిన వారు తిరిగి డబ్బు చెల్లించాలంటూ.. పలు మార్లు ఒత్తిడి చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ క్రమంలో రుణాన్ని తిరిగి చెల్లించేందుకు మార్గం కనిపించకపోవడంతో మనస్థాపం చెంది చీరతో ఉరేసుకున్నాడని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: