నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వెంకన్నపాలెంలో నివేశన స్థలాల విషయంలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. అధికారులు అసభ్యకరంగా మాట్లాడటంతో.. మనస్తాపం చెంది ఓ దళితుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సర్వే నెంబర్ 131 గ్రామ కంఠం భూమిలో నివేశన స్థలాలు వద్దని హైకోర్టు ఉత్తర్వులిచ్చినా... అధికారులు భూమిని తీసుకునేందుకు ప్రయత్నించారు. స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. అధికారులు వారితో అసభ్యకరంగా మాట్లాడారు. మనస్తాపం చెందిన వెంకటయ్య అనే దళితుడు పురుగుల మందుతాగి ఆత్మయత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
పది రోజుల క్రితం ఇదే మండలం చెర్లోపల్లిలోనూ ఇళ్ల స్థలాల విషయంలోనే ఇద్దరు దళిత మహిళల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గూడూరు రూరల్ సీఐ రామకృష్ణారెడ్డితో పాటు రెవెన్యూ అధికారుల దుందుడుకు చర్యలతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని బాధితులు వాపోయారు.
ఇదీ చూడండి. 'హైకోర్టుకు వెళ్లిన రైతుపై ప్రతీకారం తీర్చుకోవడం దారుణం'