నెల్లూరులో ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో ఈనాడు క్రికెట్ పోటీలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. నాలుగు జట్ల క్రీడాకారులు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. కృష్ణ చైతన్య డిగ్రీ ,చంద్ర రెడ్డి డిగ్రీ కళాశాల జట్లు పోటీపడగా కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల ఫైనల్కు చేరుకుంది. యన్ బి కే ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, అభ్యాసి అకాడమీ జట్లు పోటీపడగా యన్.బి.కే.ఆర్ ఇంజినీరింగ్ కళాశాల విజయం సాధించి ఫైనల్ మ్యాచ్కు అర్హత సాధించింది. రేపు ఫైనల్ పోటీలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: నెల్లూరులో హోరాహోరీగా 'ఈనాడు' క్రికెట్ పోటీలు