ఇదీ చదవండి: చిన్న కోడిగుడ్డు ఎప్పుడైనా చూశారా?
మైనర్పై వృద్ధుడి అత్యాచారయత్నం - undefined
నెల్లూరు జిల్లా, సంగం మండలం, పెరమన గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన 14ఏళ్ల బాలికపై అదే కాలనీకి చెందిన 60ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. బాలిక ఇంటికి దగ్గరలో ఉంటున్న నర్సయ్యకు బాలిక బంధువులు ఫోన్ చేసారు. వారితో బాలికను ఫోన్లో మాట్లాడించేందుకు నర్సయ్య బాలిక ఇంటికి వెళ్లాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉందని గమనించి ఫోన్ మాట్లాడిన తరువాత అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక ప్రతిఘటించి కేకలు వేయడంతో నరసయ్య పరారయ్యాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత ఏడుస్తున్న బాలికను విచారించగా జరిగిన విషయాన్ని వివరించింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ, ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. సమీపంలో ఉన్న నరసయ్యను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. నరసయ్య గతంలో కూడా తనపై అత్యాచారానికి యత్నించినట్లు బాలిక పోలీసులకు తెలిపింది.
మైనర్ పై అత్యాచారానికి యత్నించిన 60ఏళ్ల వృద్ధుడు
ఇదీ చదవండి: చిన్న కోడిగుడ్డు ఎప్పుడైనా చూశారా?