ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో కలకలం: ఒకే కుటుంబంలో ఐదుగురు మిస్సింగ్ - నెల్లూరులో ఒకే కుటుంబంలో ఐదుగురు అదృశ్యం వార్తలు

నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యమయ్యారు. ఈ కేసు మిస్టరీగా మారింది. పోలీసులు ఎంత గాలించినా.. వారి ఆచూకీ తెలియడం లేదు. మూడు బృందాలుగా వెతికినా.. ఫలితం లేదు. ఆసుపత్రి వెళ్తున్నామని.. ఆటోలో వెళ్లినట్టు తెలుస్తోంది.

ఒకే కుటుంబంలో ఐదుగురు మిస్సింగ్..!
ఒకే కుటుంబంలో ఐదుగురు మిస్సింగ్..!ఒకే కుటుంబంలో ఐదుగురు మిస్సింగ్..!
author img

By

Published : Nov 18, 2020, 12:00 AM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం జీకేపల్లికి చెందిన ఐదుగురి అదృశ్యం మిస్టరీ వీడలేదు. రెండో రోజు కూడా వీరి జాడ తెలియలేదు. ఆటోలో పిల్లలతో సహా వెళ్లారని కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైద్యం కోసం వెళ్లారని.. ఇంటికి తిరిగి రాలేదని.. కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం మరి కొన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. మూడు బృందాలుగా వెతుకులాట ప్రారంభించారు.

జీకేపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య, సుధాకర్ అన్నదమ్ములు. కృష్ణయ్య భార్య విజయ(26), కుమార్తెలు శ్రీవేణి(3) దివ్యశ్రీ (7), సుధాకర్ భార్య సుప్రియ (25), కుమార్తె సురేఖ(2) అదృశ్యం అయ్యారు. పోలీసులు తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో మూడు బృందాలుగా వెతుకులాడుతున్నారు. ఫోన్ కాల్స్ ను పరిశీలిస్తున్నారు. అయినా వారి ఆచూకీ తెలియలేదు.

ఇదీ చదవండి: చందమామపైకి సిద్ధమైన చైనా రాకెట్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.