ETV Bharat / state

108 వాహనంలో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం - పూలనీళ్లపల్లిలో 108 వాహనంలో ప్రసవం

నెల్లూరు జిల్లా పూలనీళ్లపల్లి గ్రామానికి చెందిన గర్భిణికి పురిటి నొప్పలు రావడంతో హుటాహుటిన 108 వాహనానికి సమాచారం అందించారు. గ్రామం నుంచి నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా... నొప్పులు తీవ్రమయ్యాయి. 108 వైద్య సిబ్బందే ఆ మహిళకు ప్రసవం చేశారు.

108 Childbirth in a vehicle  Maternal and child welfare at nellore district
108 వాహనంలో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
author img

By

Published : Dec 21, 2020, 12:55 PM IST

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పూలనీళ్లపల్లి గ్రామానికి చెందిన గర్భిణి సుభాషిణికి పురిటి నొప్పులు రావటంతో 108 వాహనానికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి పైలెట్ జమీర్ చేరుకున్నారు. నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువ అయ్యాయి.

సిబ్బంది అప్పటికప్పుడు స్పందించి.. మహిళకు ప్రసవం చేశారు. సుభాషిణి పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లిని బిడ్డను క్షేమంగా నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చాకచక్యంగా ప్రసవం చేయించి తల్లీబిడ్డను కాపాడిన 108 సిబ్బంది ఈఎంటీ రమేష్​, పైలెట్ జమీర్​ను సుభాషిణి బంధువులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది అభినందించారు.

ఇదీ చదవండి:

బ్యాంక్ అధికారులమంటూ నగదు దోచేస్తున్నారు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.