Electricity Department AE Escaped from ACB Officers: లంచం తీసుకోవడమే నేరం. అలాంటిది తీసుకున్న లంచంతో ఏసీబీ అధికారులకు పట్టుబడకుండా సినీ ఫక్కీలో పరార్ అయ్యాడా అధికారి. ద్విచక్ర వాహనంపై వెంబడించి పట్టుకోవడానికి ప్రయత్నించిన ఏసీబీ సీఐని కారుతో ఢీకొట్టే ప్రయత్నం కూడా చేశాడు. లంచం డబ్బులు పొలంలోకి విసిరేసి, కారుతో శరవేగంగా పొలం గట్లపై నుంచి నడుపుతూ కొంత దూరం పోయాక కారు వదిలేసి ఏసీబీ అధికారులకు పట్టుబడకుండా విద్యుత్ శాఖ ఏఈ పారిపోయాడు. ఇదంతా మన్యం జిల్లా మక్కువ మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
ములక్కాయవలసలోని పొలానికి కొత్త విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలని రైతు డి.ఈశ్వరరావు విద్యుత్ శాఖ ఏఈ శాంతారావును కోరారు. కనెక్షన్‌కు దరఖాస్తు పేరుతో ఫోన్ పే ద్వారా 4 వేల రూపాయలను తీసుకున్నాడు. కనెక్షన్ ఇవ్వడానికి రూ.60 వేలు లంచం ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇవ్వలేమని చెప్పినప్పటికీ వినలేదు.
VRO Caught by ACB Officials: రైతుల వద్ద లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్వో
అడ్వాన్స్‌గా రూ.20 వేలు తీసుకున్నాడు. మిగిలిన లంచం డబ్బుల కోసం రైతును డిమాండ్ చేశాడు. దీంతో, రైతు అనిశా అధికారులను ఆశ్రయించాడు. అనిశా అధికారుల ప్రణాళిక మేరకు ఆదివారం సాయంత్రం విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన తరువాత మిగిలిన లంచం డబ్బులు పొలం దగ్గర ఇస్తామని చెప్పాడు. విద్యుత్ కనెక్షన్ చెకింగ్ పేరుతో వచ్చిన ఏఈ కారులో కూర్చుని రైతును కారులోకి రమ్మని చెప్పి లంచం రూ. 40 వేలు అడిగి తీసుకున్నాడు.
ఏసీబీ అధికారిని ఢీకొట్టేందుకు యత్నం: ఈ తతంగమంతా దూరం నుంచి గమనిస్తున్న డీఎస్సీ రామచంద్రరావు, సీఐ టి.శ్రీనివాసరావులు ద్విచక్రవాహనంతో కారు వద్దకు చేరుకున్నారు. ఏసీబీ అధికారులను గమనించిన ఏఈ.. తన కారును పొలాల్లోకి వేగంగా నడిపాడు. గట్లు పైకి ఎక్కిన కారు ఎగురుతూ వెళుతుంటే అది చూస్తున్న రైతులు సినిమా షూటింగ్ ఏమైనా జరుగుతోందా అని ఆశ్చర్యానికి గురయ్యారు. కారును నిలువరించి ఏఈని పట్టుకునేందుకు ద్విచక్ర వాహనంపై సీఐ శ్రీనివాసరావు వెంబడించే ప్రయత్నం చేశారు కానీ, బైక్‌ను కారుతో ఢీకొట్టడంతో సీఐ కిందపడి గాయాలపాలయ్యారు. కారు దూసుకుపోయి కొంత దూరం వెళ్లాక ఆగిపోయింది. అందులోంచి ఏఈ బయటకు వచ్చి పరుగులు తీశాడు.
Saluru Municipal Commissioner in ACB Trap: లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ కమిషనర్
పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్..: లంచం తీసుకుని తప్పించుకు పోవడమే కాకుండా పట్టుకునేందుకు ప్రయత్నించిన సీఐ వాహనాన్ని ఢీకొట్టి, గాయాలపాలు చేసిన ఏఈపై తీవ్ర పరిణామాలు తప్పవని ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు అన్నారు. కోపోద్రేకులైన డీఎస్పీ విద్యుత్ శాఖ ఎస్ఈకి ఫోన్ చేసి మాట్లాడారు. పట్టుబడకుంటే పరిస్థితి వేరుగా ఉంటుందని హెచ్చరించారు. మక్కువలో జరిగిన విషయం తెలుసుకున్న ఏడీఈ శంకరరావు అక్కడి కార్యాలయానికి చేరుకుని ఏసీబీ అధికారులతో మాట్లాడారు. ఏఈకి సంబంధించిన అన్ని విషయాలను అనిశా అధికారులు సేకరించారు. ఏఈని పట్టుకునేందుకు అర్ధరాత్రి వరకు అనిశా అధికారులు పరుగులు పెట్టారు కానీ ఏఈ మాత్రం పట్టుబడలేదు.
Fake ACB Inspector Arrest : 'గ్యాంగ్' సినిమా చూసి.. రూ.లక్షల్లో దోచేసి..