ETV Bharat / state

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య - ఏపీ క్రైం న్యూస్

Wife Murdered His husband: తమ సంతోషానికి అడ్డు వస్తున్నాడని భర్తను అడ్డు తప్పించాలని పన్నాగం పన్నింది ఓ మహిళ. తన పేగు తెంచుకోని పుట్టిన వారిని కూడా వదులుకోవాలనుకుంది. పథకం ప్రకారం ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 16, 2023, 10:47 AM IST

Wife Killed Her Husband With Lover: వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ భార్య. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని మసీదుమాన్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మసీద్ మాన్యంలో నివాసం ఉంటున్న శ్రీగిరి కుమార్​కు స్వాతితో ఐదేళ్ల క్రితం పెళ్లి అయింది. వారికి కుమారుడు 5 సంవత్సరాల కుమారుడు రోషన్, 4 సంవత్సరాల కుమార్తె అక్షయ ఉన్నారు. ఈ క్రమంలో మృతుని భార్య అయిన స్వాతి, రాజవరపు మారుతి బాబు అనే వ్యక్తితో సంవత్సర కాలం నుండి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ప్రియుడితో పథకం: ఆ విషయం భర్తకు తెలిసి తరచూ ఇంట్లో భార్య భర్తల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించాలని స్వాతి ఆమె ప్రియుడు ఇద్దరూ నిశ్చయించుకున్నారు. ఈ మేరకు పథకం పన్నారు. అత్త శ్రీగిరి మేరిరోజిలిన్ నరసరావుపేట వెళ్లడాన్ని అదునుగా భావించి స్వాతి భర్తను ప్రియుడు మారుతీతో కలసి కడతేర్చింది. ఏమీ తెలియనట్లుగా ఆదివారం ఉదయం అత్తకు ఫోన్ చేసి కుమార్ లేవడం లేదని చెప్పడంతో బందువులతో వచ్చిన మేరీరోజిలిన్ .. కొడుకు ముక్కు, చెవ్వునుంచి వచ్చిన రక్తపు మరకలతో పాటు నాలుక బయటకు రావడం గమనించిన సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అనుమానం నిజమైంది: కోడలే తన కుమారుడిని హత్య చేసి ఉంటుందని పేర్కొనడంతో పట్టణ సీఐ బి. అశోక్ కుమార్ కేసు నమోదు చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. తదుపరి విచారణ చేసే క్రమంలో భార్య భర్తను ప్రియుడితో కలిసి చంపిదని తేలింది. వినుకొండ నుండి మార్కాపురం పోవు రోడ్డులో గల చెక్ పోస్ట్ సెంటర్ వద్ద ఇద్దరు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ సంబంధం కారణంగా ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసినట్లు సీఐ తెలిపారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.