ETV Bharat / state

సీఎం జగన్ హామీలే తప్ప ఆచరణేదీ? - దాహమేస్తే ఆ గిరిజనులు ఆకాశం వైపు చూడాల్సిందే! - నీరు రాక ప్రజల ఇబ్బందులు

Villages Face Severe Water Shortage: సీఎం జగన్ వినుకొండ పర్యటనలో భాగంగా సాగర్ కాల్వ నుంచి పైపులైన్ ద్వారా బొల్లాపల్లి చెరువుకు నీళ్లు సరఫరా చేసేందుకు సీపీడబ్ల్యూసీ కింద 12 కోట్ల రూపాయలు మంజూరు చేస్తునట్లు అప్పట్లో సీఎం ప్రకటించారు. కృష్ణా జలాలతో తమ దాహార్తి తీరుతుందని ఆశగా ఎదురుచూసిన జనాల ఆశలు అడియాశలుగా మారాయి. రోజులు పోయి నెలలు గడుస్తున్నా... నేటికీ పనులు అడుగు కూడా ముందుకు పడటం లేదు. కారణంగా నీటి ఎద్దడితో ఆయా గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు.

Villages Face Severe Water Shortage
Villages Face Severe Water Shortage
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2023, 5:34 PM IST

Villages Face Severe Water Shortage: కుగ్రామంగా మారిన ఈ అధునాతన సాంకేతిక యుగంలోనూ.. దాహమేస్తే గుక్కెడు నీటి కోసం ఆకాశం వైపు చూసే వారున్నారంటే నమ్ముతారా? ఒక వేళ ఉన్నా ఇంతంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది ఏ ఏడారి ప్రాంతంలో నివసిస్తున్నవారో అనుకుంటే.. అది మన తప్పు కాదు. కానీ తాగునీటి కోసం కటకటలాడుతున్న ఈ పల్లెలు ఉన్నది, నాగార్జున సాగర్ కుడి కాలువకు కూతవేటు దూరంలోనే అంది. అయినా ఏంటీ దుస్థితి అనుకుంటున్నారా... అదే మన పాలకుల సుపరిపాలనకు నిలువెత్తు సాక్ష్యం. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో నీటి సమస్య తలెత్తే ప్రమాదం పొంచి ఉన్నా... ఏ మాత్రం నివారణ చర్యలపై శ్రద్ధ పెట్టలేదు. దీంతో పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని రేమిడిచర్ల సహా పలు గ్రామాల్లో చిన్నా, పెద్దా, ముసలి, ముతక తాగునీరు లేక మూడు, నాలుగు నెలలుగా... పడుతున్న ఇబ్బందులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

హామీలే తప్ప ఆచరణేదీ? - పక్కనే 'కృష్ణమ్మ' కదులుతున్నా గొంతెండుతున్న గిరిజనులు

ఒక్క మండలాన్నీ కరవు జాబితాలో చేర్చని వైసీపీ ప్రభుత్వం - సర్కారు తీరుపై మండిపడుతున్న రైతు సంఘాలు

తాగునీరు దొరక్క గిరిజనుల గొంతెడుతోంది. సుమారు 3 నెలల నుంచి నీటి సరఫరా జరగక.. అల్లాడిపోతున్నారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలాన్ని మంచినీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సీఎం జగన్ వినుకొండ పర్యటించినపుడు.. సాగర్ కాల్వ నుంచి పైపులైన్ ద్వారా బొల్లాపల్లి చెరువుకు నీళ్లు సరఫరా చేసేందుకు సీపీడబ్ల్యూసీ కింద 12 కోట్ల రూపాయలు మంజూరు చేస్తునట్లు ఘనంగా ప్రకటించారు. ఈ పథకం పూర్తయితే మండలంలోని 20 గ్రామాలకు తాగునీటి సమస్య తీరినట్లేనని... ప్రజలు సంబరపడ్డారు. కృష్ణా జలాలతో తమ దాహార్తి తీరుతుందని భావించారు. కానీ రోజులు కాదు నెలలు గడుస్తున్నా... నేటికీ పనుల్లో ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

Women Protest For Water on Road : 'మా గ్రామం ఉన్నట్టయినా గుర్తుందా..' అధికారులపై గ్రామస్థుల ఆగ్రహానికి కారణమేంటంటే..?

సంక్షేమ పాలన చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న వైసీపీ ప్రభుత్వం... ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతుల కల్పనను పూర్తిగా గాలికి వదిలేసిందనడానికి... పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని తాగునీటి సమస్య నిదర్శనంగా చెప్పవచ్చు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో మూడు నెలలుగా వీరికి తాగునీటి సరఫరా జరగడం లేదు. ప్రత్యామ్నాయ మార్గంలేక రేమిడిచర్లలోని చెంచుకాలనీ, సుగాలీ తండా వంటి కాలనీల వాసులు... నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇతర అవసరాలకూ కొన్న నీటినే వినియోగించుకుంటున్నారు.

ఏటా బొల్లాపల్లి మండల ప్రజలు వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వర్షాలు లేక, భూగర్భ జలాలు పూర్తిగా నిండుకొని.. ఈఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లోనూ నీటి ఇక్కట్లు తప్పలేదు. కాలనీల్లోని బోర్లు ఎండిపోయినప్పుడు, కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి వ్యవసాయ బోర్ల నుంచి నీరు తెచ్చుకోవటానికి ఇక్కడి ప్రజలకు పరిపాటిగా మారింది. అయితే ఇప్పుడా వ్యవసాయ బోర్ల నుంచి సైతం నీరు రాకపోవడంతో సమస్య తారాస్థాయికి చేరింది. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటిని ప్రభుత్వం నిలిపివేసిందని వాపోతున్నారు. చిన్నారులు, వృద్ధులకు తాగునీరు లేక దాహంతో అల్లాడిపోతున్నారు.

Drinking Water Problems in West Godavari District: ప్రతిపక్షంలో హామీలిచ్చారు.. అధికారంలోకి వచ్చాక అమలు మరిచారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.