ETV Bharat / state

జల్లయ్య హత్యకు కారణం అదే : ఎస్పీ

9 Members Arrested in jallaiah Murder Case: పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన తెదేపా కార్యకర్త జల్లయ్య హత్య కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ శివశంకర్ రెడ్డి తెలిపారు. జల్లయ్య హత్యకు గల కారణాలను ఎస్పీ వెల్లడించారు.

Accused Arrested in jallaiah Murder Case

author img

By

Published : Jun 5, 2022, 10:29 PM IST

SP Shivashankar Reddy on Jallaiah Murder Case: పల్నాడు జిల్లా దుర్గి మండలంలో ఇటీవల జరిగిన తెదేపా కార్యకర్త జల్లయ్య హత్య కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శివశంకర్ రెడ్డి తెలిపారు. ఇరు వర్గాల మధ్య ఉన్న పాత గొడవలే ఈ హత్యకు కారణని ఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ. 60 వేలు స్వాధీనం చేసుకున్నట్లు మీడిమా సమావేశం ఎస్పీ పేర్కొన్నారు. పెళ్లి పనుల్లో భాగంగా వచ్చిన వ్యక్తిని ఇలా కిరాతకంగా హత్య చేయడం చాలా బాధాకరమని.. ఇలాంటి హత్యలను ఉపేక్షించబోమని ఎస్పీ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్ జోలికి వెళ్తే పీడీ యాక్ట్ పెట్టి జిల్లా బహిష్కరణ చేస్తామన్నారు. మృతుడు జల్లయ్యపై దుర్గి పీఎస్‌లో 7 కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు.

జల్లయ్య హత్యకు కారణం అదే : ఎస్పీ

అసలు ఏం జరిగిందంటే: జిల్లాలోని జంగమేశ్వరపాడులో తెలుగుదేశం కార్యకర్త కంచర్ల జల్లయ్యను ప్రత్యర్థులు దారుణంగా హత్యచేశారు. 2019 తర్వాత వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక అధికార పార్టీ నేతల దాడులను తట్టుకోలేక... పల్నాడులో చాలా మంది తెలుగుదేశం సానుభూతిపరులు స్వగ్రామాలను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. హతుడు జల్లయ్య కూడా స్వగ్రామం దుర్గి మండలం జంగమేశ్వరపాడు వదిలి గురజాల మండలంమాడుగులలో తలదాచుకుంటున్నారు. కుటుంబంలో పెళ్లి నేపథ్యంలో బ్యాంకు పనినిమిత్తం, శుభలేఖలు పంచేందుకు ఆయన దుర్గి వచ్చారు. అక్కడి నుంచి బొల్లాపల్లి మండలం రావులాపురానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో జంగమేశ్వరపాడు మీదుగా వస్తారని తెలుసుకున్న ప్రత్యర్థులు..గ్రామ సమీపంలోని మించాలపాడు అడ్డరోడ్డు వద్ద కాపు కాశారు.

ద్విచక్రవాహనంపై జల్లయ్యతో పాటు ఆయన బంధువులు ఎల్లయ్య, బక్కయ్య వస్తుండగా అడ్డగించి దాడి చేశారు. గాయపడిన ఎల్లయ్య, బక్కయ్యలు అటవీ ప్రాంతంలోకి పారిపోగా.. ప్రత్యర్థులు జల్లయ్యను జంగమేశ్వరపాడులోకి తీసుకొచ్చారు. గొడ్డళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈలోగా చుట్టుపక్కల వారు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. జల్లయ్యను అంబులెన్సులో మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగా జల్లయ్య ప్రాణం విడిచాడు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.